భారత్‌పై అమెరికా సుంకాలు విధించడంపై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం వివరణ ఇచ్చారు. అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశం విధించిన సుంకాల పర్యవసానాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. భారత్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుందని అన్నారు. దేశ ప్రయోజనాలు, చిన్న పరిశ్రమ, రైతులు, వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పీయూష్ పేర్కొన్నారు.