తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికావస్తున్న తరుణంలో వరంగల్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొస్తామని అన్నారు. 4వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళిక చేశామని చెప్పారు. వరంగల్ కు రూ.6000 కోట్లనిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టామన్నారు. వచ్చే పదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలిస్తామన్నారు.