తెలంగాణ ప్రజల అవసరాలు, వైద్య సేవల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్య విద్యను అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. ఆసుపత్రులు మెడికల్ కళాశాలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో దామోదర, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృధ్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు.