పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, దేశంలో ఇంధన భద్రత, ఎరువుల లభ్యత, భారతీయ పౌరుల రక్షణపై కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు తాజా పరిస్థితిని వివరించారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, నిత్యావసరాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. గల్ఫ్ నుండి దిగుమతులు ప్రభావితమైనప్పటికీ, ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. రష్యా నుంచి యూరియా, సౌదీ అరేబియాతో డీఏపీ కోసం ఒప్పందాలున్నాయి. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.