పశ్చిమాసియా యుద్ధం.. భారత్ ఇంధన నిల్వలు 50% పెంపు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. దీనిని ఎదుర్కోవడానికి, దిగుమతులపై ఆధారపడిన భారత్ తన అత్యవసర ఇంధన నిల్వ సామర్థ్యాన్ని 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఉన్న నిల్వలను 90 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు, ధరల హెచ్చుతగ్గులను నియంత్రించి, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఆయిల్ కంపెనీలను ఫ్యూయల్ కెపాసిటీని పెంచుకోవాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్