ఉపా(UAPA) చట్టం కింద నేరం స్వరూపాన్ని బట్టి శిక్షలు మారుతాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం, వాటిని ప్రోత్సహించడం లేదా సహకరించడం వంటి నేరాలకు గరిష్ఠంగా 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. ఉగ్రవాద చర్యల కేసుల్లో శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. ఉగ్రదాడి కారణంగా మరణాలు సంభవిస్తే జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చు. ఇతర ఉగ్రవాద సంబంధిత నేరాలకు కనీసం 5 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు ఉంటుది. అలాగే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.