ఏపీలోని పాఠశాలలకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే, రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు.