దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, రోజువారీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు అన్న దానిపై ఆసక్తి ఉంటుంది. గ్లోబల్‌గా బంగారం ధరలను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఉదయం 10:30, మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రకటిస్తుంది. భారత్‌లో అదే రేట్లను ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) రూపాయిల్లో విడుదల చేస్తుంది. డాలర్-రూపాయి మారకం విలువ, డిమాండ్-సప్లై, ఇంపోర్ట్ ఛార్జీలు వంటివి ధరలపై ప్రభావం చూపుతాయి.