వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రతిష్ఠాత్మక 'మెడల్ ఆఫ్ ఆనర్'ను పొందిన తొలి భారత న్యాయవాదిగా భువన్ రిభు ఘనత సాధించారు. డొమినికన్ రిపబ్లిక్‌లో జరిగిన వరల్డ్ లా కాంగ్రెస్ 2025లో ఈయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. బాలల హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాదిగా ఈయన గుర్తింపు పొందారు.