విమానం కాక్‌పిట్‌లో ఎప్పుడూ ఇద్దరు పైలట్లు ఎందుకుండాలి?

కాక్‌పిట్‌లో ఒక పైలట్‌ ఒంటరిగా ఉండటం విమాన భద్రతలో కీలక అంశంగా మారింది. 1999లో ఈజిప్ట్‌ఎయిర్‌ 990 ప్రమాదంలో కెప్టెన్‌ బయటకు వెళ్లిన సమయంలో ఫస్ట్‌ ఆఫీసర్‌ విమాన నియంత్రణ చేపట్టగా.. విమానం కూలి 217 మంది మరణించారు. 2015లో జర్మన్‌వింగ్స్‌ 9525లోనూ కెప్టెన్‌ బయటకు వెళ్లిన సమయంలో కోపైలట్‌ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కిందికి దింపడంతో 150 మంది మృతి చెందారు. ఈ ఘటనల తర్వాత కాక్‌పిట్‌లో కనీసం ఇద్దరు సిబ్బంది ఉండేలా మార్గదర్శకాలు రూపొందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕