బైక్‌లపై మహిళలు ఒకవైపే ఎందుకు కూర్చుంటారు?

భారత్‌లో మహిళలు ద్విచక్ర వాహనాలపై ఒకే వైపు కాళ్లు వేసుకుని కూర్చోవడానికి దుస్తులు, సామాజిక కట్టుబాట్లు ప్రధాన కారణాలు. చీరలు, పొడవైన దుస్తులు చక్రాలు, చైన్‌లో చిక్కుకునే ప్రమాదం ఉండటంతో చాలామంది ఈ పద్ధతిని అనుసరిస్తారు. దీనికి యూరప్‌లోని పాత ‘సైడ్‌శాడిల్‌ రైడింగ్‌’ సంప్రదాయంతో సంబంధం ఉందనే వాదనలున్నాయి. అయితే, ఇలా కూర్చోవడం వల్ల వాహనం బ్యాలెన్స్‌ దెబ్బతిని ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన హెల్మెట్‌ ధరించి, సురక్షితంగా కూర్చోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕