వితంతువైన కోడలికి భరణం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

భర్త మరణించిన తర్వాత వితంతువైన కోడలికి మామ ఆస్తి నుంచి భరణం పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మామ మరణం తర్వాత కూడా కోడలికి భరణం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. మామ జీవించి ఉన్నప్పుడే వితంతువైన కోడలికి భరణం వర్తిస్తుందన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. విధవరాలైన కోడలికి భరణం నిరాకరించడం ఆమెను పేదరికంలోకి నెట్టడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సంబంధిత పోస్ట్