పిల్లలు పుట్టలేదని భార్యను నిందించలేం: మద్రాస్ హైకోర్టు

వివాహం అంటే కేవలం సంతానోత్పత్తి మాత్రమే కాదని, సంతానం కలగకపోవడాన్ని భార్య వైఫల్యంగా భావించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం పిల్లలు పుట్టలేదన్న కారణంతో భార్యను నిందించడం క్రూరత్వమని, విడాకులు ఇవ్వడానికి ఇది సరైన కారణం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సంతానోత్పత్తి చికిత్స సమయంలో మహిళలు పడే శారీరక, మానసిక వేదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పు 2007లో వివాహం చేసుకున్న దంపతులకు సంబంధించిన కేసులో వెలువడింది.

సంబంధిత పోస్ట్

✕
✕