భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఆర్మీ మాజీ కెప్టెన్ సందీప్ తోమర్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2013లో భార్యను హత్య చేసిన తోమర్‌కు 2014లో జీవిత ఖైదు పడింది. 2019లో బెయిల్‌పై బయటకు వచ్చి, హైకోర్టు అప్పీల్‌ను కొట్టివేసినా లొంగిపోలేదు. గుర్తింపు, నివాస ప్రాంతాలు మార్చుతూ తప్పించుకుంటున్న అతడిని, పాన్‌కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా ద్వారా మధ్యప్రదేశ్‌లోని పాంఢుర్నాలో ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసిన సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు.