హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ బంద్

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బోనాల సందర్భంగా 2 రోజులు వైన్ షాపులు, బార్లు మూతబడనున్నాయి. జులై 13వ తేదీ ఉదయం 6:00 నుండి 15వ తేదీ ఉదయం 6:00 వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్‌లోని వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్టు తెలంగాణ సర్కార్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ జోన్‌లోని గాంధీనగర్, ఈస్ట్ జోన్‌లోని చిలకల్‌గూడ, నార్త్ జోన్‌లోని బేగంపేట్, గోపాలపురం, మహంకాళి డివిజన్లలో వైన్స్, బార్లు మూసివేయనున్నారు.

సంబంధిత పోస్ట్