ఓ మహిళ గుండె స్పందనలు 17 నిమిషాల పాటు ఆగిపోయాయి. యూకేలోని గౌసెస్టర్ నగరానికి చెందిన 35 ఏళ్ల విక్టోరియా థామస్ అనే మహిళ జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా కుప్పకూలింది. వెంటనే పక్కనున్నవాళ్లు హుటాహుటిన సీపీఆర్ చేయగా 17 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే ఆమెకు అరుదైన జన్యుపరమైన మల్టిపుల్ హార్ట్ ఫెయిల్యూర్ అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. అయితే ఆమెకు గుండె మార్పిడి జరగడంతో ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.