పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో రకరకాల రంగులను గుర్తించే నైపుణ్యం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో 20 శాతం పురుషుల కంటే ఎక్కువ కచ్చితత్వంతో మహిళలు గుర్తిస్తారట. ఉదాహరణకు పురుషులు నీలం రంగును ఒక్కటే గుర్తించగలిగితే, మహిళలు అందులోనే ఉండే మరో నాలుగు వైవిధ్యాలను కూడా గుర్తించగలరని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మహిళలలోని నాడీ వ్యవస్థ అని వైద్యులు పేర్కొంటున్నారు.