కెనడాలో దాదాపు 10 లక్షల మంది వలసదారుల వర్క్ పర్మిట్లకు 2025 డిసెంబరుతో గడువు ముగియనుంది. ఈ ఏడాది మరో 9 లక్షల మంది వర్క్ పర్మిట్లకు కూడా గడువు ముగియనుంది. దీంతో మరో వీసా లేదా శాశ్వత నివాసం పొందేవరకు ఈ వలసదారులు చట్టబద్ధ నివాస హోదాను కోల్పోనున్నారు. ప్రభావిత వలసదారుల్లో దాదాపు సగం మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం.