ప్రపంచ పాల దినోత్సవం.. ఎప్పుడంటే?

ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడతాయి, ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఎదుగుదల, ఎముకల బలం, కండరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. పాల ప్రాముఖ్యంపై అవగాహన పెంచడం, పాడి పరిశ్రమను ప్రోత్సహించడం ఈ దినోత్సవం లక్ష్యం. 2001లో ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్