X (గ్రోక్ AI) దుర్వినియోగం.. నివేదిక కోరిన కేంద్రం

సోషల్ మీడియా వేదిక Xలో Al ఆధారిత సేవ ‘గ్రోక్ (Grok AI)’ను దుర్వినియోగం చేస్తూ అశ్లీల, నగ్న, అసభ్య కంటెంట్ రూపొందించి ప్రచారం చేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో చట్టబద్ధ బాధ్యతలను పాటించడంలో X వైఫల్యం చెందిందంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ షాక్ నోటీసు జారీ చేసింది. 72 గంటల్లోగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. X వేదికలో ‘Grok AI’ సేవను ఉపయోగించి నకిలీ ఖాతాలు సృష్టించి మహిళల ఫోటోలు, వీడియోలను వక్రీకరించడం, అసభ్యంగా ప్రచారం చేయడం జరుగుతోందని కేంద్రం పేర్కొంది.

సంబంధిత పోస్ట్