తెలంగాణ అవతరణ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శనివారం పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణం, జెండా ఆవిష్కరణ స్థలం, పోలీస్ పరేడ్ గ్రౌండ్, విద్యుత్తు, పారిశుద్ధ్య సౌకర్యాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ విజిలెన్స్ ఆఫీసర్, కలెక్టరేట్ ఏవో, తహసీల్దార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్