యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో 12 వార్డులలో మొత్తం 13,670 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడించింది. ఇందులో 6,691 మంది పురుషులు, 6,978 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యను కూడా జాబితాలో పొందుపరిచారు. అత్యధికంగా 11వ వార్డులో 1,235 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా 2వ వార్డులో 979 మంది ఓటర్లు ఉన్నారు.