గుండాల: నూతన ఎస్సైగా శోభన్ బాధ్యతలు స్వీకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూతన ఎస్సైగా శోభన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని, నేర రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్