యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని కంకణలగూడెం గ్రామంలో 10వ తరగతి విద్యార్థి కోసం జిల్లా కలెక్టర్ హనుమంత రావు గురువారం ఉదయం 5 గంటలకు ఇళ్లకు వెళ్లి తలుపు కొట్టారు. భరత్ చంద్ర చారి అంటూ విద్యార్థిని పిలుస్తూ నేను కలెక్టర్ ని వచ్చానంటూ ఎలా చదువుతున్నావు అంటూ ఆరా తీశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకొని పరీక్షలు అయ్యేంత వరకు నెలకు 5 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.