యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గురువారం పర్యటించనున్నారు. ఉదయం 10:00గం. లకు భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ విధానాలను మరియు నేతన్నల సమస్యల పై సమావేశం లో పాల్గోంటారు. నేతన్న బీమా పథకం లోని అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొననున్నారు.