యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, సిబ్బంది క్రమశిక్షణ, అత్యవసర సమయాల్లో స్పందించే విధానం, రిసెప్షన్ కౌంటర్, క్రైమ్ విభాగం, జనరల్ డైరీ నిర్వహణ, పెట్రోల్ కార్లు, బ్లూ కోల్ట్స్ వాహనాల స్థితిగతులు, సైరన్లు, కమ్యూనికేషన్ సెట్లు, జీపీఎస్ వ్యవస్థల పనితీరును ఎస్పీ స్వయంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు.