వేలి ముద్రలు సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి. శంఖు ఆకారం వేలి ముద్రలు ఉన్న వ్యక్తులు ప్రశాంతమైన, నిర్మలమైన స్వభావం కలిగి ఉంటారట. వంపు గీతల వేలి ముద్రలు సముద్రపు అలలను పోలి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు చాలా శక్తివంతంగా, ఆచరణాత్మకంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వృత్తాకారంలో వేలి ముద్రలు ఉన్నవారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారికి నచ్చిన మార్గంలో పనులు చేయడానికి ఇష్టపడతారు. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి.