యూట్యూబ్ జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లకు బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు విచారణ న్యాయస్థానం.. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. బెయిల్ మంజూరైన ఈ ఇద్దరు జర్నలిస్టులు ప్రతి సోమవారం, శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిన నిబంధన విధించారు. చంచల్‌గూడ జైలు నుంచి వీరిని త్వరలో విడుదల చేయనున్నారు.