అమెజాన్‌, మీషోతో జట్టు కట్టిన యూట్యూబ్‌.. క్రియేటర్లకు మరింత ఆదాయం

భారత్‌లో యూట్యూబ్ తన 'షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌'ను విస్తరించింది. క్రియేటర్ల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో అమెజాన్, అజియో, మీషో, స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలతో పాటు ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ల ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలలో ట్యాగ్ చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. ఉత్పత్తుల వివరాలను వీక్షకులు నేరుగా వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా అడిగి తెలుసుకునేలా 'ఆస్క్ యూట్యూబ్ ఫర్ షాపింగ్' ఏఐ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕