పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ.. "రాజకీయమంటే పెత్తందారి విధానం కాదు.. పేదల జీవితాలు మార్చేదని ఎన్టీఆర్ చేసి చూపించారు. ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీఆరే. ఆడబిడ్డలు చదువుకోవడానికి మహిళా విశ్వవిద్యాలయం పెట్టారు. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం." అని అన్నారు.