AP: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తామని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్ ఉచితమా? డబ్బులు చెల్లించాలా? అనే సందేహం అందరిలో ఉంది. అయితే ఈ ప్లాట్లు పూర్తి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ప్లాట్లు కేటాయిస్తారు. కేంద్ర పథకాలతో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. గతంలో ప్లాట్లు పొంది ఇల్లు నిర్మించుకోని వారికి వాటిని రద్దు చేసి కొత్త ప్లాట్లు ఇవ్వనున్నారు.