గ్యాస్ సిలిండర్‌ను ఇళ్లకు డెలివరీ చేసే వ్యక్తికి అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. LPG ఏజెన్సీల పంపిణీదారులు ఆమోదించిన మేరకు వారి ప్రాంగణం నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. సిబ్బంది వద్ద వేయింగ్ స్కేలు, లీక్ టెస్టర్లు ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. అదనపు డబ్బుల కోసం ఎవరైనా డిమాండ్ చేస్తే 1967 నంబరుకు లేదా జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.