AP: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు మండలం పాలకుర్తి వద్ద ప్రమాదం జరిగింది. లారీ టైర్ పేలి కారుపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. మృతులు కోడుమూరు వాసులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.