"స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి అందరూ సహకరించాలి"
జీవీఎంసీ జోన్ -6 పరిధిలోని దేవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాలతో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ ప్రసాద్ రాజా ఆద్వర్యంలో నిర్వహించారు. ప్రాథమిక అరోగ్య కేంద్ర ఆవరణను శుభ్రం చేసి పిచ్చి మొక్కలు తొలగించారు. అనంతరం స్వచ్చ ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేశారు. ఈఓఎం. శ్రీనివాసరావు, బంకురు గోపాలం, వెంకటలక్ష్మి, సునీత తదితరలున్నారు.