HMPV: దేశంలో ఆంక్షలు విధించిన తొలి జిల్లా
తమిళనాడులోని నీలగిరి జిల్లా హ్యూమన్ మెటా న్యూమోవైరస్ కేసులతో అప్రమత్తమైంది. కర్ణాటక, కేరళ సరిహద్దులున్న ఈ జిల్లాలో ఊటీ సహా పలు పర్యాటక ప్రాంతాలున్నాయి. దీంతో ప్రజల, పర్యాటకుల భద్రత దృష్ట్యా ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్కు ధరించాలని అక్కడి కలెక్టర్ తన్నీరు లక్ష్మీ భవ్య ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సర్వైలెన్స్ టీమ్లను రంగంలోకి దింపడంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులతో తనిఖీలు చేస్తామన్నారు.