తెలంగాణ, బాంబే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసేందుకు సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. 2023 జులైలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే నియమితులైన విషయం తెలిసిందే.