

విజయసాయిరెడ్డి చెప్పినవి విన్నాక కన్నీళ్లు వచ్చాయి: షర్మిల (వీడియో)
విజయసాయిరెడ్డి చెప్పినవి విన్నాక కన్నీళ్లు వచ్చాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. 'మేనకోడలు, మేనల్లుడి ఆస్తులు కాజేయాలని జగన్ కుట్రలు చేశారు. నా వ్యక్తిత్వంపైనా పలువురితో నీచంగా మాట్లాడించారు. వైఎస్సార్ కోరికకు భిన్నంగా అబద్ధం ఆడాలని విజయసాయిపై ఒత్తిడి చేశారు. పరువు పోతుందని విజయసాయి చెప్పినా జగన్ ఊరుకోలేదు. ఏ అబద్ధం ఎలా చెప్పాలో జగన్ చెబితే విజయసాయి రాసుకున్నారట.' అని షర్మిల్ అన్నారు.