ప్రతి కార్యకర్త వంద మందితో సభ్యత్వం నమోదు చేయించాలి
ప్రతి బిజేపీ కార్యకర్త వంద మందితో సభ్యత్వ నమోదు చేయించాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్స్ పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. అనకాపల్లిలో జిల్లా పార్టీ అధ్యక్షులు పరమేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సభ్యత్వం నమోదును చేపట్టాలన్నారు.