అనకాపల్లి: అర్జీలపై సకాలంలో చర్యలు చేపట్టాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింటు కలెక్టరు ఎం. జాహ్నవి, జిల్లా రెవిన్యూ అధికారి వై ఎస్ వి కె జి ఎస్ ఎల్ సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.