ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రుణమాఫీ చేశాం: CM
తమ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామని CM రేవంత్ అన్నారు. పేద మహిళలకు రూ.500కే సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని నిరూపించమన్నారు. ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామని.. చేసి చూపించమన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచామన్నారు.