

BREAKING: ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది మృతి (వీడియో)
కుంభమేళాకు వెళ్లే భక్తులతో ఢిల్లీ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. 12 మంది గాయపడినట్లు సమాచారం. ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లు రద్దయ్యాయని వదంతులే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని సమాచారం. ఈ ఘటనపై కేంద్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది.