ప్రధాని మోదీని వ్యక్తిగతంగా తాను తిట్టలేదని.. ఆయన పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. "మోదీ పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని అన్నాను. నా వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలి." అని రేవంత్ అన్నారు.