కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్1 నుంచి ఏకీకృత పెన్షన్ పథకం (UPS) అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. NPS కింద UPSను ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేసుకోవచ్చు. దీని కింద ఉద్యోగి చనిపోయిన తర్వాత పెన్షన్ లో 60% ఫ్యామిలీకి పెన్షన్ అందిస్తారు. రిటైర్డ్ టైంలో గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు కూడా ఉంటాయి. 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి చివరి ఏడాది బేసిక్ పే సగటులో 50% పెన్షన్ ఇస్తారు.