ప్రశాంతంగా ముగిసిన సర్వసభ్య సమావేశం

72చూసినవారు
ప్రశాంతంగా ముగిసిన సర్వసభ్య సమావేశం
సింగనమలలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీవో నిర్మలాకుమారి సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై చర్చించాలని అధికారులకు సూచించారు. మండల అధికారులు శాఖల వారీగా మండల ప్రగతి నివేదికలను సమావేశంలో క్షుణ్ణంగా వివరించారు. మండల వ్యవసాయ అధికారి అన్వేశ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు తప్పకుండా పొలాలలో సాగుచేసిన పంటను ఈ క్రాప్ చేయించుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్