Nov 15, 2024, 06:11 IST/
మహిళలకు గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Nov 15, 2024, 06:11 IST
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతున్న సందర్భంగా మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది. బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చికి సంబంధించి మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లను రిలీజ్ చేసింది. సర్కారు కానుకగా ఈ డబ్బులు త్వరలో మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి.