ముద్దనూరు: నత్రజని ఎరువులు ఎక్కువ వాడరాదు

73చూసినవారు
ముద్దనూరు: నత్రజని ఎరువులు ఎక్కువ వాడరాదు
పంటలకు నత్రజని ఎరువులు ఎక్కువగా వాడరాదని ఎఒ వెంకటకృష్ణారెడ్డి సూచించారు. ముద్దనూరు మండలంలోని యామవరం గ్రామ రైతు సేవా కేంద్రంలో సోమవారం ఎఒ ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ.. యూరియాను పంటలకు అధికంగా వాడితే చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నత్రజని ఎరువులు వాడుకోవాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్