జమ్మలమడుగు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
జమ్మలమడుగు పట్టణంలోని నాగుల కట్ట వీధి నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో గురువారం సాయంత్రం బైపాస్ కు సమీపంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు మృతుడు నాగులకట్ట వీధికి చెందిన దూదేకుల మనోహర్ గా గుర్తించారు. అతడు వీధుల వెంట తిరుగుతూ ఇనుప ముక్కలు ఏరుకుంటూ మద్యానికి బానిసైనట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి జమ్మలమడుగు ఎస్ఐ రామకృష్ణ చేరుకొని విచారిస్తున్నారు.