రోడ్డు ప్రమాదాలపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ కోరారు. బుధవారం పులివెందుల స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ మండలంలోని వాహనదారులు జాగ్రత్తలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించొద్దన్నారు.