గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ (వీడియో)
బిగ్ బాష్ లీగ్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ విల్ సథర్లాండ్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్ - సిడ్నీ థండర్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్ ఓ భారీ షాట్ కొట్టగా, మిడాఫ్‌లో ఉన్న సథర్లాండ్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.