'పుష్ప-2' ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. 2 రోజులుగా మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదని చెప్పారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని.. పైప్ ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అతడికి జ్వరం లేదని తెలిపారు.